VSP: విశాఖ సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీగా పనిచేస్తూ డీడీగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న డి రమేష్‌ను ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. విశాఖ సమాచార పౌర సంబంధాల శాఖ డిడి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు జ్ఞాపికను అందజేశారు. విధి నిర్వహణలో సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.