KNR: మానకొండూరు మండలంలో ఇసుక రీచ్ లారీల హావా కొనసాగుతోంది. ఊటూరు నుంచి పోచంపల్లి వరకు ప్రధాన రహదారులపై వందలాది లారీలు పార్క్ చేయడంతో రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో లారీలు కనిపించక ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలన్న నిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.