»Dont Get Involved In Controversies Always Be A Congressman Ds
D.Srinivas : వివాదాల్లోకి లాగొద్దు ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే : డీఎస్
కాంగ్రెస్ లో (Congress) చేరిక వార్తలపై మాజీ మంత్రి డి. శ్రీనివాస్ (D.Srinivas )ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఉత్తరం రాశాడు. తన కొడుకు సంజయ్ చేరిక సందర్బంగానే తాను గాంధీ భవన్కు (Gandhi Bhavan) వెళ్లినట్లు ఆయన లెటర్లో వెల్లడించారు. ఆ సందర్బంగా తనకు కాంగ్రెస్ కండువా కప్పారని ఆయన తెలిపారు.దాంతో తాను మళ్లీ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగిందన్నారు. అయితే, నేనెప్పటికీ కాంగ్రెస్ వాదినే అని డీఎస్ తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ లో (Congress) చేరిక వార్తలపై మాజీ మంత్రి డి. శ్రీనివాస్ (D.Srinivas )ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఉత్తరం రాశాడు. తన కొడుకు సంజయ్ చేరిక సందర్బంగానే తాను గాంధీ భవన్కు (Gandhi Bhavan) వెళ్లినట్లు ఆయన లెటర్లో వెల్లడించారు. ఆ సందర్బంగా తనకు కాంగ్రెస్ కండువా కప్పారని ఆయన తెలిపారు.దాంతో తాను మళ్లీ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగిందన్నారు. అయితే, నేనెప్పటికీ కాంగ్రెస్ వాదినే అని డీఎస్ తేల్చి చెప్పారు. ప్రస్తుత ఆరోగ్యం దృష్ట్యా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నానని లేఖలో తెలిపారాయన. కాంగ్రెస్ లో నా చేరికకు, నా కుమారుడు సంజయ్ టికెట్ కు ముడిపెట్టడం సరికాదన్నారు డీఎస్.
క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న తనను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు డీఎస్. కాంగ్రెస్ లో నేను చేరినట్లు భావిస్తే.. ఇది నా రాజీనామా అనుకుని ఆమోదించగలరని మల్లికార్జున ఖర్గేకు (Mallikarjuna Kharge) రాసిన లేఖలో కోరారు డీఎస్ (DS). తన తండ్రి రాజీనామా వేనుక తమ కుటుంబానికి చెందిన బీజేపీ నాయకుడి హస్తం ఉందని తమ్ముడి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ ఆరోపించారు. ఇది పక్కా అరవింద్ (Aravind)పనే అని సంజయ్ స్ఫష్టం చేశారు. నిన్న తన తండ్రి డీ శ్రీనివాస్ ఎంతో సంతోషంగా అందరి సమక్షంలో మీడియా సాక్షిగా కాంగ్రెస్ కండువా ప్పుకున్నారని, సుమారు మూడు గంటలు గాంధీభవన్లో ఉన్నారని సంజయ్ అన్నారు. ఉన్నట్టుండి ఇవాళ రాజీనామా (resignation) అంటూ తన తల్లి లేఖను విడుదల చేయడాన్ని సంజయ్ తప్పు పట్టారు.