బీఆర్ఎస్ రెబల్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao)వెళ్తున్నారు. తుక్కుగూడ నుంచి కార్యకర్తలతో ర్యాలీగా కొత్తగూడెం(Kothagudem) వెళ్లనున్నారు జూపల్లి. ఇప్పటికే జూపల్లి నివాసానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
బీఆర్ఎస్ రెబల్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao)వెళ్తున్నారు. తుక్కుగూడ నుంచి కార్యకర్తలతో ర్యాలీగా కొత్తగూడెం(Kothagudem) వెళ్లనున్నారు జూపల్లి. ఇప్పటికే జూపల్లి నివాసానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. టీఆర్ఎస్లో ఉన్న అంసతృప్త నేతలు ఒక్కటి కాబోతున్నారా..? పార్టీలోనే ఉంటూ మాటలు తూటాలు పేల్చే నేతలను కూడగట్టే పనిలో ఉన్నారా..? ఆ బాధ్యతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎత్తుకున్నారా అనే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొంతకాలంగా మాజీ ఎంపీ పొంగులేటి బీఆర్ఎస్ అధిష్టానంతో విభేదించిన విషయం తెలిసిందే.
ఆయన పార్టీ మారుతున్న విషయమూ స్పష్టమైంది. కానీ ఇంతవరకు ఏపార్టీలో ఎప్పుడు చేరుతున్నారనేది మాత్రం ఎవరికీ క్లారిటీ ఉండటం లేదు.ఈ క్రమంలో పొంగులేటి ఓ వైపు ఉమ్మడి జిల్లాపై తన పట్టు సాధిస్తూనే మరో వైపు పార్టీలో ఉండి అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలను కూడగట్టే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాల (spiritual gathering)పేరుతో తన టీంను రెడీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న శ్రీనివాసరెడ్డి నేడు కొత్తగూడెంలో భారీగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే (Kolhapur MLA) బీరం హర్షవర్ధన్ తో కొంతకాలంగా జూపల్లి కృష్ణారావుకి విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరికి అస్సలు పడడం లేదు. నాయకులిద్దరూ ఒకే పార్టీలో ఉన్నా..ఆధితప్య పోరు కొనసాగుతోంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నుంచి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి(Beeram Harshavardhan Reddy) ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జూపల్లి ఓడిపోయారు. హర్షవర్ధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్నాళ్ల తర్వాత ఎమ్మెల్యే హర్షవర్ధన్ అధికార పార్టీ బీఆర్ఎస్ (BRS) లో చేరారు. ఇక అప్పటి నుంచి జూపల్లి, హర్షవర్ధన్ కు అస్సలు పడడం లేదు.కొంత కాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారే విషయమై సందిగ్ధంలో ఉన్నారు. ఏ పార్టీనో తెలియక అటు అభిమానులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలోనే అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి కొత్తగూడెం (Kothagudem) లో జరిగే సమ్మేళనానికి జూపల్లిని ఆహ్వానించడంతో ఏమైనా ప్రకటన చేస్తారా..? అనే ప్రచారం జరుగుతోంది.