»Didnt Have A Child For Inheritance Upasana Post Went Viral
Upasana : వారసత్వం కోసం బిడ్డను కనలేదు… ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా కోడలు, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన కొణిదెల మరికొద్ది రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భవతి. పెళ్లైన పదేళ్ల తర్వాత గర్భం దాల్చడంతో మెగా ఫ్యామిలీ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక ఉపాసన ఇంట్లోనే ఉంటూ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లో ఉంటున్నారు.
మెగా కోడలు ఉపాసన (upasana) ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్(Ram Charan), ఉపాసన పెళ్లీ జరిగి పదేళ్ల పూర్తయిన తర్వాత వారు తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే వివాహం(marriage) ఇంత కాలానికి ఉపాసన గర్భం దాల్చడంతో అటు మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ వారసుడు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మదర్స్ డే (Mother’s Day) రోజున పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను బిడ్డని కనటానికి గల కారణం గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. మదర్స్ డే సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న ఫోటోని షేర్ చేసిన ఉపాసన..’ తల్లి కావాలనే నా నిర్ణయం వారసత్వం కొనసాగించాలని కోరిక లేదా నా వైవాహిక బంధం (Marital relationship) బలోపేతం చేయాలన్న కోరికతో తీసుకున్నది కాదు.పుట్టబోయే నా బిడ్డకు అంతులేని ప్రేమ అందించడమే కాకుండా జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటానని మానసికంగా సిద్ధమైన తర్వాతనే తల్లి కావాలని నిర్ణయం తీసుకున్నా ‘ అంటూ ఉపాసన సోషల్ మీడియా(Social media)లో రాసుకొచ్చింది.