BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు కూడా వెంటనే పరిష్కరించేటట్లు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగినట్లు ఆయన తెలిపారు.