BHNG: లక్ష్మీ నరసింహస్వామి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధని సమేత రామలింగేశ్వర స్వామికి సోమవారం సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రభాత వేళలో మొదటగా పరమశివుడిని కొలుస్తూ సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకమయ్యారు. పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించి, విభూతితో అలంకరణ చేసి అర్చించారు.