పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత తెలిపారు. పంచాయతీ ఎన్నికల కారణంగా ముందుగా 13న జరగాల్సిన లోక్ అదాలత్ను 21కి వాయిదా వేశారు.గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా అదనపు పోక్సో న్యాయమూర్తితో కలిసి లోకదాలత్ పోస్టర్లను ఆవిష్కరించారు.