JGL: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం 1994 ప్రకారం ఆడ, మగ అని చెప్పడం చట్టరీత్యా నేరమని మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జగిత్యాలలోని పలు స్కానింగ్ సెంటర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, స్కానింగ్ మిషన్స్, డాక్టర్ల అర్హత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.