GNTR: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు.. పొన్నూరు పట్టణంలోని 17 సచివాలయాల పరిధిలో ఈనెల 23 నుండి 30వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపుల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ఆధార్ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు.