NLG: చింతపల్లిలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత ‘వైకుంఠ రథాన్ని’ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ రథం ద్వారా అంతిమయాత్రకు అయ్యే ఖర్చును పంచాయతీ భరిస్తుందని, పేద ధనిక తేడా లేకుండా అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం కొండభిమనపల్లిలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.