NGKL: తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణుల బోర్డుకు నూతన సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా, అటవీ శాఖ మంత్రి ఉపాధ్యక్షుడిగా ఉండే ఈ బోర్డులో నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సభ్యుడిగా నియమించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అచ్చంపేటలో ఉండడంతో ఎమ్మెల్యేకు ఈ అవకాశం దక్కింది.