GNTR: సహకార సంఘం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, కాకుమాను GDCC బ్యాంకు ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. గత నవంబర్ నుంచి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో, రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు తెలిపారు.