KMM: ఉద్యోగ విరమణ పొందినవారికి రెండు పెన్షన్లను తొలగించడం చాలా బాధాకరమని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య విమర్శించారు. రాజకీయ పదవులను అనుభవించేవారికి రెండు పెన్షన్లు ఎందుకని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.