ADB: లంబాడి కులస్తులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదివాసి తుడుం దెబ్బ జిల్లా నాయకులు శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిని ఎస్టీలుగా గుర్తించడం వలన స్థానికులు నష్టపోతున్నారన్నారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు గోడెం గణేష్ తెలిపారు.