MLG: ఆదివారం జరిగే రెండో విడత ఎన్నికలపై అధికార కాంగ్రెస్లో టెన్షన్ మొదలైంది. తొలి అంకంలో మెజార్టీ గ్రామాలను కైవసం చేసుకున్నప్పటికీ ఏటూరునాగారం, తాడ్వాయి చేజారడాన్ని ఆపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గంపెడాశలు పెట్టుకున్న మల్లంపల్లి, పత్తిపల్లి, దేవగిరిపట్నం, జాకారం, అబ్బాపురం, జంగాలపల్లి, వెంకటాపూర్, నల్లగుంట,లక్ష్మీదేవిపేటలో ఫలితంపై ఆసక్తి నెలకొంది.