SRCL: ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి పథకంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, మహిళల ఆత్మ గౌరవానికి తోడ్పడుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. ఇల్లంతకుంట రైతు వేదికలో మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.