SRD: కొండాపూర్ మండలం తొగర్ పల్లి గ్రామంలోని బీసీ బాలుర హాస్టల్‌ను కలెక్టర్ ప్రావిణ్య శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పంపిణీ చేసిన కార్పెట్లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని వార్డెన్‌కు సూచించారు.