మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. బుధవారం అధికారులతో ఆమె సమావేశమయ్యారు. తొలి విడతలో 8 జడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.