KMR: బాన్సువాడ పట్టణంలోని పద్మశాలి సంఘం గణేశ్ మండలి, స్వర్ణకార గణేశ్ మండలి గణేష్ వద్ద ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పూజల్లో పాల్గొన్నారు. చిన్నారులు, మహిళలతో కోలాటాలు ఆడారు. అనంతరం ఆయన శోభాయాత్రలో పాల్గొన్నారు. పట్టణంలో గణేశ్ నిమజ్జనానికి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిమజ్జనయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.