హైదరాబాద్ శివార్లలో కార్తీకమాసంలో వనభోజనాలు చేసేందుకు పలు అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. ఆయుష్ వనం బహదూర్‌పల్లి (23 కి.మీ)లో 50 ఎకరాల్లో విస్తరించి ఉంది. నందనవనం వరంగల్ రహదారిపై నారపల్లి (23 కి.మీ)లో ఉంది. దూలపల్లి ఫారెస్ట్ 22 కి.మీ దూరంలోని ఈ ప్రాంతంలో కార్తీకవనం అభివృద్ధి చేశారు. సంజీవని వనం నాగార్జున సాగర్ రోడ్డు మార్గంలోని గుర్రంగూడ ప్రాంతంలో ఉంది.