KMR: కామారెడ్డి పట్టణంలోని UPHC సెంటర్లోనీ హరిజనవాడలో వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను బుధవారం హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రవీందర్ పరిశీలించారు. చిన్న పిల్లలకు అందిస్తున్న టీకాలపై సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. వ్యాక్సినేషన్ క్రమ పద్ధతిలో వేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఏఎన్ఎం, ఆశాలకు సూచించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు.