VKB: కొడంగల్ నియోజకవర్గంలో పత్తి సీజన్‌తో దళారుల దందా మొదలైంది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా సీసీఐలో తేమ పేరుతో కోర్రిలతో రైతులు ప్రైవేట్‌లో తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి. దళారులు తక్కువ ధరకు కొనుగోలుతో లాభాలు పొందుతున్నారు. వివిధ గ్రామాల్లో ప్రైవేట్ వ్యాపారులు యథేచ్ఛగా పత్తి కొనుగోళ్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.