MHBD: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దవంగర మండలం కాన్వాయి గూడెంలో ఇవాళ చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన కసాని ఐలయ్య (36) మండలంలో యూరియా దొరకక కొడకండ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో అతన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా ఐలయ్య చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.