»Commencement Of The Visit To The Presidents Residence
Bollaram : రాష్ట్రపతి నిలయ సందర్శన ప్రారంభం
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం( Bollaram )లోని రాష్ట్రపతి నిలయం( Rashtrapati Nilayam ) సందర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Droupadi Murmu ) వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలో నాలెడ్జ్ గ్యాలరీ, కిచెన్ టన్నెల్, విజిటర్స్ ఫెసిలిటీస్ సెంటర్స్, మెట్ల బావిని కూడా రాష్ట్రపతి ప్రారంభించారు. ఇక రాష్ట్రపతి నిలయాన్ని ఇక నుంచి అన్ని రోజుల్లో సందర్శించే అవకాశం కలిగింది. డిసెంబర్ మినహా అన్ని రోజుల్లో సందర్శకులకు అవకాశం కల్పించారు.
తెలంగాణ (Telanagna) సంప్రదాయ కళతో కిచెన్ టన్నెల్ (Kitchen tunnel) పునర్నిర్మాణం జరిగిందని తెలిపారు. నా హయాంలో బట్టర్ ఫ్లై, (Butterfly) రాక్, నక్షత్ర గార్డెన్స్(Nakshatra Gardens) ప్రారంభించడం సంతోషంగా ఉందని ద్రౌపది ముర్ము ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్ నుంచి టికెట్ల బుక్ చేసుకోవచ్చు. అక్కడకు వెళ్లి కూడా నేరుగా టికెట్లు తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ రుసుమును భారతీయులకు రూ.50, విదేశీయులకు రూ.250లుగా నిర్ధారించారు. సందర్శకుల కోసం రాష్ట్రపతి నిలయంలో ఉచితంగా పార్కింగ్, వస్తువులు భద్రపరుచుకునేందుకు ప్రత్యేక గది, వీల్ ఛైర్ సదుపాయం, మంచి నీరు, ప్రాథమిక చికిత్స సహా ఇతర వసతులను ఏర్పాటు చేస్తున్నారు.
బొల్లారం రాష్ట్రపతి నిలయం దేశంలోనే అత్యున్నతమైన నివాసంగా దిల్లీలోని రాష్ట్రపతి భవనం ఉంటుంది. పాలన మొత్తం ఉత్తర భారతదేశానికే పరిమితం కాకుండా ఉండాలనే ఆలోచనతో దక్షిణాదిలో ఈ బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ నిలయాన్ని బ్రిటీషర్లు 1805లో బొల్లారంలో నిర్మించారు. ఈ గృహాన్ని అప్పట్లో వైశ్రాయ్ అతిథి (Vishroy is the guest) గృహంగా పిలిచేవారు. ఆంధ్రసబ్ ఏరియా కార్యాలయానికి విచ్చేసే భద్రతాధికారులు ఇందులో ఉండేవారు. ఆ తర్వాత బ్రిటీష్ రెసిడెంట్పై దాడి జరగడంతో కోఠి (Koti) నుంచి నివాసాన్ని బొల్లారానికి మార్చారు. అనంతరం దానిని నిజాం స్వాధీనం చేసుకున్నారు. ఈ భవనాన్ని కేంద్రం 1950లో రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. రాష్ట్రపతి నిలయంగా పేరు మార్చింది