Ambedkar విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. బౌద్ద గురువుల ప్రార్థనలు, పూల వర్షం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఈ రోజు ఆవిష్కరించారు. హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు.
CM Kcr unveils Ambedkar statue:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల (125 foot) ఎత్తులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ (prakash ambedkar), మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
విగ్రహావిష్కరణ సందర్భంగా బౌద్ధ భిక్షవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంబేద్కర్ (Ambedkar) విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. ఆ పూల వర్షాన్ని సీఎం కేసీఆర్ (kcr), ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వీక్షించారు. జై భీమ్ (jai bhim) అని సీఎం కేసీఆర్ (cm kcr) నినదించారు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చప్పట్లతో పూల వర్షాన్ని స్వాగతించారు. అంబేద్కర్ (Ambedkar) విగ్రహా శిలా ఫలకాన్ని ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరించారు.
అంబేద్కర్ కలలు సాకారం కావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నాం అని.. ఎవరో అడిగితే పెట్టలేదని చెప్పారు. సచివాలయానికి కూడా అంబేద్కర్ (Ambedkar) పేరు పెట్టామని గుర్తుచేశారు. తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహాం అని తెలిపారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపేందుకు చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతాం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల కోసం పలు పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. 50 వేల మందికి దళితబంధు అందజేశామని వివరించారు.
ఆ తర్వాత ప్రకాశ్ అంబేద్కర్ ( prakash Ambedkar) మాట్లాడుతూ.. దేశ రెండో రాజధాని హైదరాబాద్ (hyderabad) కావాలని అంబేద్కర్ ఆశయం అని.. ఇప్పటివరకు నెరవేరలేదన్నారు. రక్షణ సమస్య వచ్చినా.. పాకిస్థాన్, చైనా నుంచి హైదరాబాద్ దూరంలో ఉందన్నారు. ఎలాంటి దాడులకు అవకాశం ఉండదన్నారు. దళిత బంధు పథకం అద్భుతం అని ప్రకాష్ అంబేద్కర్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు బలిదానంతో అంబేద్కర్ చలించిపోయారని.. అందుకే రాష్ట్రాల ఏర్పాటు కోసం స్పష్టమైన విధానం రూపొందించారని తెలిపారు. అంబేద్కర్ మార్గాన్నే సీఎం కేసీఆర్ (cm kcr) ఎంచుకున్నారని వివరించారు.