»Telangana Government Not Invited To Governor On Ambedkar Statue Unveil
CM Kcr Derogation గవర్నర్.. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అందని ఆహ్వానం
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య ఉన్న దూరం మరోసారి బయటపడింది. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరించే కార్యక్రమానికి గవర్నర్ను సీఎం ఆహ్వానించలేదు..
Telangana government not invited to governor on ambedkar statue unveil
governor:తెలంగాణ గవర్నర్ (governer) తమిళి సై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ (kcr) మధ్య పొసగడం లేదు. అప్పుడప్పుడు కలిసిన సందర్బాల్లో పైకి.. మాట్లాడుతున్న.. లోన మాత్రం ఏం మారలేదు. 125 అడుగుల భారీ అంబేద్కర్ (ambedkar) విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరిస్తున్నారు. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ (prakash ambedkar) వస్తోన్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ను ఆహ్వానించలేదు. దీంతో మరోసారి గవర్నర్ వర్సెస్ సీఎం అనే చర్చ తెరపైకి వచ్చింది.
వాస్తవానికి రెండురోజుల ముందే గవర్నర్ను (governer) ప్రభుత్వం ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు వరకు కూడా ఆహ్వానం అందలేదని రాజ్ భవన్ వర్గాల ద్వారా తెలిసింది. తమిళి సైకు, కేసీఆర్కు పడటం లేదు. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఇష్యూ అప్పటి నుంచి దూరం పెరిగింది. గత ఏడాది.. కరోనా పేరు చెప్పి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సెషన్ నడిచింది. ఈ సారి కూడా చర్చల తర్వాత గవర్నర్కు ఆహ్వానించారు. బిల్లుల విషయంలో గవర్నర్ కూడా పట్టుదలతో ఉన్నారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లగా.. సుప్రీం కోర్టు కన్నా రాజ్ భవన్ దగ్గర ఉంది అని తమిళి సై కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ( Ambedkar) 125 అడుగుల విగ్రహాం (125 foot) ఆవిష్కరణ జరగనుంది. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ (ntr garden) ఆనుకుని ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ (prakash Ambedkar) పాల్గొంటారు. మంత్రులు (ministers), ఎంపీలు (mp), ఇతర ప్రజా ప్రతినిధులు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు.
అంబేద్కర్ (Ambedkar) విగ్రహాం కోసం 11.80 ఎకరాల స్థలం కేటాయించి.. విగ్రహాం తయారీకి ప్రభుత్వం రూ.146.50 కోట్లు ఖర్చు చేసింది. విగ్రహాం కింద పీఠంలో 27,556 చదరపు అడుగుల స్థలం ఉంది. ఇందులో అంబేద్కర్ (Ambedkar) మ్యూజియం, అంబేద్కర్ (Ambedkar) జీవితానికి సంబంధించి ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తారు. లైబ్రరీ కూడా నెలకొల్పుతారు.