KNR: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామంలో దుర్గమ్మ తల్లి గుడి ముందు డ్రైనేజీ మురుగు నీరు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. గ్రామ పంచాయతీ అధికారులు సమస్యను పట్టించుకోకపోవడంతో వంగపల్లి రవి అనే వ్యక్తి మురుగు నీటిలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ మురుగు నీరు వ్యాధులకు కారణమవుతుందని, వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.