RR: సమాజంలో పోలియోను నిర్మూలించడం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. అనంతరం మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో విజయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.