NZB: ఆర్మూర్ మండలం మగ్గిడి పాఠశాల పూర్వ విద్యార్థిని నిషిత జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల పీఈటీ మధు తెలిపారు. ప్రస్తుతం నిషిత వైజాగ్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందుతోందన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి 21వరకు రాజస్థాన్‌లో జరుగుతున్న జూనియర్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌కు ఎస్ఏఐ టీం తరఫున ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు.