BDK: అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయని అన్నారు. సమాచారం అందుకున్న సీఐ అశోక్ రెడ్డి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పెర్కోన్నారు.