NLG: దేవరకొండ మండలం కర్నాటిపల్లి గ్రామ పంచాయతీ పరిధి సీత్య ఆంగోత్ తండాకు చెందిన ఆంగోత్ దోలి మృతి తీవ్ర విషాదకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. దోలి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.