VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని మార్కెట్ యార్డ్ పరిసరాలు చెత్తాచెదారంతో పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. శనివారాల్లో మార్కెటుకు వచ్చే వినియోగదారులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం స్పందించాలని ప్రజలు కోరారు.