MNCL: చిరు, వీధి వ్యాపారులకు బ్యాంక్ రుణాలు అందించి వ్యాపార అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. లోక కళ్యాణం పథకంలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో మెప్మా అధికారులు వీధి విక్రయదారులను గుర్తించి రుణాలు అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో 29,000 మంది వ్యాపారులకు రూ.45 కోట్లకు పైగా రుణాలను అధికారులు అందజేశారు.