వరంగల్లోని భద్రకాళి ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు ఇచ్చి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. జిల్లా పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.