NZB: ఆర్మూర్ సుందరయ్య కాలనీలో సమస్యలను పరిష్కరించాలని CPM ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో MLA పైడి రాకేష్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. సుందరయ్య కాలనీలో పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని CPM నాయకులు తెలిపారు.