VKB: పెద్దేముల్ మండలంలో మొదటి రోజు 38 సర్పంచ్ స్థానాలకు 27 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని ఎంపీడీవో రతన్ సింగ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా తొమ్మిది క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 308 స్థానాలకు గాను 25 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. మొదటి రోజు నామినేషన్ల సందడి నెలకొంది.