GDWL: మల్దకల్ మండలం బుజ్వారంలో చెప్పుల వ్యాపారం చేసుకునే రాజనందం కూతురు ఎస్.హేమీమ అద్భుతం కనపరిచింది. తెలంగాణ ప్రభుత్వం వెలువరించిన నీట్ ఫలితాలలో ఆమె కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించింది. గురుకుల పాఠశాలలో చదివిన హేమీమ తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చినందుకు సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆమెను అభినందించారు.