SRD: హత్నూర మండలం కాసాల పంచాయతీ 12వ వార్డులో కాలనీవాసుల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. సమస్యను పట్టించుకునే వారు లేకపోవడంతో ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ట్యాంకు మెట్లు ధ్వంసమై, పరిసరాలు అపరిశుభ్రంగా మారినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.