గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబోలో మరో ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్‌ను సుకుమార్ లాక్ చేశాడట. అంతేకాదు మరికొన్ని రోజుల్లో దీని ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మే నుంచి దీని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.