గుంటూరు: అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం కలకలం రేగింది. ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.