ప్రకాశం: కనిగిరిలో శుక్రవారం ఎస్సై కృష్ణ పావని విద్యార్థులకు ‘శక్తి యాప్’ పై అవగాహన కల్పించారు. అత్యవసర, ఆపద సమయాల్లో ఈ యాప్ ద్వారా మహిళలు రక్షణ పొందవచ్చని, పోలీసులను సంప్రదిస్తే నిమిషాల వ్యవధిలో సహాయం అందుతుందని ఆమె తెలిపారు. ఈ యాప్ మహిళల భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులకు వివరించారు.