ATP: IPS గోపీనాథ్ జెట్టి, మాజీ ఐఏఎస్ కృష్ణయ్యను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై YS జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ తన స్థాయిని మరిచి మాట్లాడటం సరికాదన్నారు. బీసీ అధికారులను అవమానపరిచే విధంగా మాట్లాడటం మానుకోకపోతే తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.