NZM: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 11,14,17వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది జిల్లాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కాసుల వేట కొనసాగిస్తున్నారు. ఎక్కువ అభ్యర్థులు పోటీ చేసే జనరల్ స్థానాల్లో ఈ ధోరణి తారస్థాయికి చేరుకుంది. కొంతమంది అభ్యర్థుల అప్పులు చేసి మరి పోటీ చేస్తున్నారు.