బాపట్ల: అద్దంకి పట్టణంలో దళిత, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ అంబేద్కర్, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను అంటూ నినాదాలు చేశారు.