CTR: ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేద్కర్‌కు దక్కతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం చిత్తూరు పట్టణంలోని దర్గ సమీపానగల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం అందుతున్నాయని చెప్పారు.