KDP: ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన చేనేత కార్మికుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారిని ఆదుకుంటామని రాజంపేట టిడిపి ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. మాధవరం-1 పరిధిలోని పార్వతిపురం,వెంకటేశ్వరపురం ప్రాంతాల్లో చేనేత మగ్గం గుంతల్లోకి చేరిన నీటిని శుక్రవారం ఆయన పరిశీలించారు. చేనేత కార్మికులు పనులు లేక ఇబ్బందులకు గురి కావడం బాధాకరమన్నారు.