ADB: బజారత్నూర్ మండలం పిప్రికి చెందిన రామగిరి సాయి కుమార్ (28) మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. 4 నెలల క్రితం బతుకుదెరువు కోసం మాల్టా దేశానికి వెళ్లిన సాయికుమార్, అకస్మాత్తుగా బిల్డింగ్ పైనుంచి పడి మృతి చెందాడు. 35 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు శుక్రవారం అతని మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు.