బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ధురంధర్’. నిన్న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈద్ కానుకగా వచ్చే ఏడాది మార్చి 19న ‘ధురంధర్ 2’ విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ భారత్, పాక్ ఉగ్రవాద కాన్సెప్ట్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది.