యాషెస్ 2వ టెస్టులో AUS ప్లేయర్ మార్నస్ లబుషేన్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. డే & నైట్ టెస్టుల్లో 1000+ రన్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. లబుషేన్ 16 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో పాటు 1023 రన్స్ చేశాడు. ఓవరాల్‌గా స్టీవ్ స్మిత్(865), వార్నర్(753), హెడ్(752), రూట్(639) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ లిస్ట్ టాప్ 10 ప్లేయర్లలో భారత్ నుంచి ఒక్కరూ లేరు.